భోగి రోజున రేగుపళ్ళు పిల్లలని కూర్చోబెట్టి, వాళ్ళ మీద నించి ఎందుకు కిందకి విడిచి పెడతారు?
భోగి పండుగ నాటికి అమ్మవారి అనుగ్రహం రేగు పండులోనికి ప్రవేశిస్తుంది. అందుకే చిన్నపిల్లలకి జాతకరీత్యా ఏమైనా ఇబ్బందులుంటే తొలగించటానికి .
వాళ్ళు కూర్చొని పెద్ద పెద్ద యజ్ఞ యాగాది క్రతువులని నిర్వహించలేరు కనుక చిల్లరపైసలు, బంతిపూలు, రేగుపళ్ళు, చెరుకు ముక్కలు, కొబ్బరి ముక్కలు ఇటువంటివి కలిపి పెద్ద వాళ్ళు పిల్లలని కూర్చోబెట్టి వాళ్ళ మీద నించి ఈ పదార్ధాలని కిందకి విడిచి పెడతారు. ఈ పదార్ధాలు వాళ్ళ మీద నించి కిందకి పడిపోతే, భోగి పీడ తొలగిపోయి, వాళ్ళు సంతోషంగా జీవితం గడపటానికి ఏ అనారోగ్యం ప్రతిబంధకంగా వచ్చేటటువంటి అవకాశంఉంటుందో అటువంటి అవకాశం తొలగిపోయి, వాళ్ళు ఉత్తరోత్తర జీవితంలో సంతోషంగా ఉండటానికి కావలసిన వ్యవస్థ ఏర్పడుతుంది. అందుకే భోగిపీడ తొలగించుకొనే అద్భుతమైన రోజు భోగి
రేగు పళ్ళని సంస్కృతంలో బదరీ ఫలాలంటారు. పూర్వం నర నారాయణులు బదరీ వనంలో తపస్సు చేశారు.అక్కడ తపస్సు చేసుకుంటూ వాళ్ళు రోజూ చుట్టుపక్కలవున్న చెట్లనుంచి ఒక్క రేగు పండుని ఆహారంగా తీసుకునే వాళ్లు. సాక్షాత్తూ నారాయణుడు అక్కడ తిరుగుతూ, రేగు పళ్ళని తింటూ, ఆ ప్రదేశాల్నీ, వృక్షాలనీ, వనాన్నీ స్పృశించి ఆశీర్వదించారు. ఆ ప్రదేశమే బదరీ క్షేత్రం. బదరీ ఫలాలు నారాయణుడిచే స్పృశించబడి సాక్షాత్తూ ఆ దేవ దేవుని ఆశీస్సులు పొందాయి కనుక ఆ పళ్ళను ఎవరు వాడినా సిరిసంపదలు, భోగ భాగ్యాలతో తులతూగుతారంటారు. భోగినాడు పెద్దవారు పిల్లలకి భోగి పళ్ళుపోసి ఆశీర్వదిస్తారు.
భోగిపళ్లు పోసే సంప్రదాయం ఉంది ఏమో అని మీ పెద్దవారు నీ అడగండి, ఉంటే వారు ఏ వయసు వచ్చే వరకు పోయవచ్చొ కూడా అడగండి.
ఈ సంప్రదాయం లేని / తెలియని వారు కోసం చెప్తున్న, 3 నెలల పిల్లల నుంచి 5 సంత్సరకాలం ఉన్న చిన్నపిల్లలు కి భోగి పాలు పోయవచు, సాధారణం గా అందరూ చేసుకోవచ్చు.
Sri Chaganti Koteshwara Rao Garu
Comments
Post a Comment