నాలుగేళ్ల కొడుకును చంపి సూటుకేసులో కుక్కిన తల్లికర్ణాటక - భర్తతో విభేదాలతో కారణంగా ఓ కసాయి తల్లి తన నాలుగేళ్ల కొడుకును చంపి సూటుకేసులో తరలిస్తూ పోలీసులకు చిక్కింది.బెంగళూరుకు చెందిన మైండ్‌ఫుల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ సీఈఓ సూచనా సేథ్ విభేదాల కారణంగా తన భర్తతో దూరంగా ఉంటుంది. శనివారం తన కొడుకుతో కలిసి గోవా వెళ్లగా సోమవారం బెంగళూరు వెళ్లేందుకు రూం ఖాళీ చేసింది.హోటల్ సిబ్బంది రూంలో రక్తపు మరకలను గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలిసులు ఆమె వెళ్తున్న టాక్సీ డ్రైవరుతో మాట్లాడగా తన కొడుకును గోవా లోని స్నేహితుని ఇంట్లో వదిలినట్లు సమాధానం ఇచ్చింది. అక్కడ ఆరా తీస్తే తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలింది.చివరకు ఆమె కారును చెక్ చేయగా సూటుకేసులో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు.

నాలుగేళ్ల కొడుకును చంపి సూటుకేసులో కుక్కిన తల్లి

కర్ణాటక - భర్తతో విభేదాలతో కారణంగా ఓ కసాయి తల్లి తన నాలుగేళ్ల కొడుకును చంపి సూటుకేసులో తరలిస్తూ పోలీసులకు చిక్కింది.

బెంగళూరుకు చెందిన మైండ్‌ఫుల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ సీఈఓ సూచనా సేథ్ విభేదాల కారణంగా తన భర్తతో దూరంగా ఉంటుంది. శనివారం తన కొడుకుతో కలిసి గోవా వెళ్లగా సోమవారం బెంగళూరు వెళ్లేందుకు రూం ఖాళీ చేసింది.

హోటల్ సిబ్బంది రూంలో రక్తపు మరకలను గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలిసులు ఆమె వెళ్తున్న టాక్సీ డ్రైవరుతో మాట్లాడగా తన కొడుకును గోవా లోని స్నేహితుని ఇంట్లో వదిలినట్లు సమాధానం ఇచ్చింది. అక్కడ ఆరా తీస్తే తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలింది.

చివరకు ఆమె కారును చెక్ చేయగా సూటుకేసులో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు.

Comments