ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. అంతే కాక ముంబైలోని 11 చోట్ల బాంబులు పెట్టినట్లు ఆర్బీఐని బెదిరించారు కొందరు పోకిరీలు. ఈ-మెయిల్ ద్వారా బెదిరింపు వచ్చింది. ఈ-మెయిల్ పంపిన వ్యక్తి తాను భారత వ్యతిరేకి అని పేర్కొన్నాడ. ఆర్‌బీఐ కార్యాలయాలు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకుల్లో బాంబులు అమర్చినట్లు ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు.
అంతే కాదు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజీనామా చేయాలని ఈ-మెయిల్ ద్వారా డిమాండ్ చేశారు. ముంబైలోని 11 చోట్ల బాంబులు పెట్టి పేల్చేస్తామని బెదిరించారు. ఈ ఇ-మెయిల్ ప్రకారం, పేలుడు ఈ రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు జరగాల్సి ఉంది, కానీ ఏమీ జరగలేదు.
మరోవైపు, ఈ-మెయిల్ అందడంతో, పోలీసులు చుట్టుపక్కల సోదాలు ప్రారంభించారు. అయితే సోదాల్లో బాంబు లు ఏమి దొరకలేదు. ఇప్పుడు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈమెయిల్ ఎవరు పంపారనే కోణంలో విచారణ జరుగుతోంది.
Comments
Post a Comment