ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. పపువా ప్రాంతంలో వచ్చిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2 గా నమోదైంది
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. పపువా ప్రాంతంలో వచ్చిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2 గా నమోదైంది. మరికొన్ని చోట్ల 6.3, 6.5గా నమోదైంది. శనివారం రాత్రి 10.46 గంటలకు భూకంపం రాగా.. భూకంప కేంద్రాన్ని 77 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటివరకూ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అక్కడి మీడియా వెల్లడించింది.
అలాగే భూకంపం కారణంగా ఎలాంటి సునామీలు వచ్చే ప్రమాదం లేదని వాతావరణ విభాగం తెలిపింది. కానీ.. మరికొన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. భూకంపం సంభవించిన ప్రాంతం జయపురాలోని అబేపురాకు ఈశాన్యంగా 162 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాని లోతు 10 కిలోమీటర్ల దిగువన ఉంది.
27 కోట్ల జనాభా ఉన్న ఇండోనేషియాలో తరచూ భూప్రకంపనలు వస్తుంటాయి. నవంబర్ 21న పశ్చిమ జావాలో 5.6 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల 331 మంది మరణించగా.. 600 మందికి పైగా గాయపడ్డారు. 2018లో సులవేసిలో సంభవించిన భూకంపం, సునామీ 4340 మందిని బలితీసుకుంది.
Comments
Post a Comment